![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -101 లో....తాయారు చెప్పినట్లు వినకుండా గాయత్రి, మాధవ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావే అని ఇంట్లో అందరు గాయత్రిపై కోప్పడతారు. బావ ఇన్ని రోజులు తల్లి చాటు బిడ్డలాగా ఉన్నాను.. తెల్లవారితే నా జీవితం వేరొకరి చేతిలోకి వెళ్తుంది. ఇప్పుడు కూడా మాట్లాడకుంటే నా బావకి నేను దూరం అవుతాను.. మొన్న మా అమ్మ పీకపై కత్తి పెట్టుకొని చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేసిందని జరిగిందంతా గాయత్రి చెప్తుంది.
నీ మాటలు నమ్మడానికి లేదని చక్రి, కేశవ అంటాడు. నా బావపై ఉన్న ప్రేమ మాత్రం నిజం.. మావయ్య నీకు తెలుసు కదా అని గాయత్రి అంటుంది. ఇప్పుడు మావాడిని పెళ్లి చేసుకుంటావా అని నారాయణ అడగ్గానే చేసుకుంటానని గాయత్రి అంటుంది. మాధవని పెళ్లి కొడుకులాగా రెడీ చేస్తారు. మాధవకి ఏం జరుగుతుందో అర్ధం కాదు.. చక్రి వెళ్లి తాళి తీసుకొని వస్తాడు.. గాయత్రి మెడలో మాధవ తాళి కట్టబోతుంటే తాయారు, పురుషోత్తం వస్తారు. పెళ్లి అడ్డుకోబోతుంటే చక్రి, కేశవ ఇద్దరు కలిసి పురుషోత్తాన్ని ఆపుతారు. ఈ ఇంట్లోకి వచ్చి నువ్వు ఏం చేస్తావే అని గాయత్రిని తాయారు కొడుతుంది. ఇక తాయారు మాట వినకుండా మాధవని పెళ్లి చేసుకుంటానని గాయత్రి అంటుంది.
ఆ తర్వాత గాయత్రి ఎంత బెదిరించినా అలా కఠినంగా మాట్లడుతుంటే.. తాయారు వాళ్ళు టెన్షన్ అవుతారు. ఇక మాధవని పక్కకి తీసుకొని వెళ్తారు తాయారు, పురుషోత్తం. మీకు మాకు ఎన్ని గొడవలున్నా అది ఈ పెళ్లితో ముడి పెట్టొద్దు.. నా పరువుపోతుంది.. దాని పెళ్లి కోసం తిండితిప్పలు లేకుండా కష్టపడ్డానని మాధవ కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకోకని పురుషోత్తం అడుగుతాడు. తాయారు కూడా మాధవని రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తే అది బ్రతుకుతుందా అని మాధవ అడుగుతాడు. ఇక ఆ తర్వాత తాయారు, పురుషోత్తం బ్లాక్ మెయిల్ కి మాధవ కరిగిపోయి పెళ్లి చేసుకోనని అంటాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |